Sunday, 20 November 2011

పొడుపు కధలు

అక్కడిక్కడి బండి అంతరాల బండి..!
మద్ధూరి సంతలోన మాయమైన బండి.
జ:సూర్యుడు

అడవిన పుట్టాను
నల్లగా మారాను;
 ఇంటికి వచ్చాను
ఎర్రగా మారాను ;
కుప్పలో పడ్డాను
తెల్లగా మారాను.
జ:బొగ్గు


అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
చెంబులో నీళ్లన్నీ
చెడ త్రాగుతుంది.
జ:గంధపు చెక్క
 
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
తైతక్కలాడింది
పెరుగులో మునిగింది మాకింత పెట్టింది
జ:కవ్వం

అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది,మా యమ్మ మెచ్చింది;
తాడోసి కట్టింది,తైతక్కలాడింది;
కడవలో దూరింది గుర్రుమన్నాది;
పెరుగులో మునిగింది, వేన్నింత తెచ్చింది;
నా కింత పెట్టింది.
జ:కవ్వం



అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
తైతక్కలాడింది
జ:నాగ స్వరం




అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది మహాలక్ష్మి
ఎవరు?
జ:గడప

అన్న కందవు, అమ్మ కందుతాయి ఎంటవి ?
జ:పెదవులు


అన్నదమ్ములు ముగ్గురం మేము
శుభ వేళల్లో కనిపిస్తూ ఉంటాము;
అయితే బుద్ధులు వేరు.....
నీళ్ళలో మునిగే వాడొకడు
తేలే వాడొకడు
కరిగే వాడొకడు
అయితే మే మెవరం ?
జ:ఆకు, వొక్క, సున్నం


అమ్మ కడుపునా పడ్డాను, అంత సుఖమున్నాను;
నీ చేదెబ్బలు, నిలువునా ఎండి పోయాను;
నిప్పుల గుండం తొక్కాను; గుప్పెడు బూడిదనైనాను.
జ:పిడక


అర చెయ్యంత పట్నంలో అరవై ఆరు గదులు;
గది కోక సిపాయి, సిపాయి కొక తుపాకి.
జ:తేనె పట్టు


అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
జ:అద్దము


ఆకాశమంత అల్లుకు రాగ;
చేటెడు చెక్కులు చెక్కుకు రాగ;
కడివెడు నీరు కారుకు రాగా;
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జ:గానుగ


ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జ:కల్లు


ఆకాశాన అరవై గదులు;
గది కొక్క సిపాయి;
సిపాయి కొక్క తుపాకి.
జ:తేనె పట్టు


ఆడదాని కంటుకుంటుంది;
మగ వాడికి వేలాడుతుంది. ఏంటది ?
జ:దిద్దులు, పోగులు


ఆమడ నుంచి అల్లుడొస్తే
మంచం కింద ఇద్దరూ
గోడ మూల ఒకరూ
దాగుతున్నారు
జ:చెప్పుల జోడు, చేతి కర్ర


ఇంటి వెనక వెంపఛి చెట్టు
ఏ కాయ కాయమంటే ఆ కాయే కాస్తుంది
జ: కుమ్మరి సారె

ఇంతింతాకు  బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.
జ:మంగళ సూత్రం

ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన  రాత్నలాకు.
జ:తమలపాకు

ఇక్కడి నుంచి చూస్తే ఇనుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండ;
తింటే తీయగనుండు
జ:తాటి పండు

ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జ:ఆకాశం

ఊరంతా నాకి మూలాన కూర్చుండేది... ఏంటదీ...?
జ:చెప్పులు

ఊల్లో కలి, వీధిలో కలి;
ఇంట్లో కలి,ఒంట్లో కలి.
జ:చాకలి,రోకలి,వాకలి,ఆకలి.

Wednesday, 2 November 2011