గోదావరి పుష్కరాల విశిష్టత ప్రాముఖ్యత
నమస్కారం గోదావరి పుస్కరాలకి తెలుగు రాష్ట్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబౌతున్నాయి.
జులై 14 నుంచి 25 వరకూ జరిగే ఈ పుష్కరాలు తెలంగాణలోని భద్రాచలం భాసర ధర్మపురి అటు ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి నగరాలు పుష్కరాలకి వచ్చే యాత్రికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పుష్కరాల విశిష్టత ని పుష్కరుడి చరిత్ర దాని ప్రాముఖ్యత విశిష్టతని మీరు తెలుసుకోవచ్చు.
గోదావరి మాత
భద్రాచలం
పుష్కరుని చరిత్ర
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పుణాలు చెప్తున్నాయి.
భారత దేశం లో గంగ నది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది ఈ గోదావరి నదిని దక్షిణ గంగ గా అబివర్నిస్తుంటారు. అంతటి ప్రాముక్యం గల ఈ పుణ్య నది యొక్క రాసి సింహరాశి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి ఈ సమయం లో పుణ్య నగరి రాజమండ్రి కి దేశ విదేశాల నుండి బక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది బక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక సొబ తో విరాజిల్లు తుంది.భారత దేశం లో గంగ నది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది ఈ గోదావరి నదిని దక్షిణ గంగ గా అబివర్నిస్తుంటారు. అంతటి ప్రాముక్యం గల ఈ పుణ్య నది యొక్క రాసి సింహరాశి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి ఈ సమయం లో పుణ్య నగరి రాజమండ్రి కి దేశ విదేశాల నుండి బక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది బక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక సొబ తో విరాజిల్లు తుంది.
పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పుష్కర జననం
పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.
పుష్కరాల సమయంలో చేయవలసిన దానాలు - వాటి ఫలితాలు
గౌతమిలో పుష్కరుడు నివసించే కాలాన్ని పుష్కరాలు అని అంటారు. అందుకే పుష్కర కాలంలో చేసే స్నానాలకు, ఇచ్చే దానాలకు మంచి ఫలితముంటుందని నమ్మకం. సాధారణ రోజుల్లో సంవత్సరం పాటు గోదావరి నదీ స్నానం ఆచరిస్తే ఎంత ఫలితముంటుందో, పుష్కరాల్లో ఒక్కసారి స్నానం చేస్తే అంతే ఫలితం దక్కుతుందని చెబుతారు. వేలకొలది మనుసుతో, వాక్కుతో, శరీరంతో చేసిన వివిధ పాపాలన్నీ పుష్కర స్నానం వల్ల తొలగుతాయని విశ్వాసం. తులాపురుష దానాలు వెయ్యి చేస్తే ఏ ఫలితం దక్కుతుందో, వంద కన్యాదానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అంత ఫలితం పుష్కర స్నానం వల్ల లభిస్తుందని చెబుతారు.
అంతేగాకుండా పుష్కర కాలంలో చేసే దానాల వలన కలిగే ఫలితాలు అంతా ఇంతా కావు. దానాలలో సాలిగ్రామ దానం, శిలాదానం, కన్యాదానం, తిలపాత్రదానం, సరస్వతీ దానం..ఇవీ ఉత్తమమైన దానాలు. నదీ స్నానం చేసే ఇవి దానం చేస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని కూడా చెబుతారు. అందుకే పుష్కరాల్లో ఏరోజున ఏ వస్తువులు దానం చేయాలో కూడా పేర్కొన్నారు.
పుష్కర దానాలు రోజుల వారీగా ఇలా ఉన్నాయి..
మొదటి రోజు
బంగారం, వెండి, ధాన్యం, భూమి. తొలిరోజు వెండిదానం చేసిన వారు చంద్రలోకానికి వెళతారని, ధాన్యం దానం చేస్తే కుబేరుడంతటి ధనవంతులవుతారని, భూమి దానం చేసిన వారికి రాజయోగం పడుతుందని చెబుతారు.
రెండవ రోజు
వస్త్రం, లవణం, ఆవు, రత్నాలు. వీటిలో ఏ ఒక్కటి దానం చేసిన ధన్యులవుతారని చెబుతారు.
మూడవ రోజు
బెల్లం, కూరలు, గుర్రం, పళ్లు, ఇల్లు. మూడవ రోజు ఎంతో ఫలితాన్నిచ్చే రోజు. గంధం దానం చేసిన వారు గంధర్వలోకానికి వెళతారని, ఫలదానం చేసిన వ్యక్తి ఇంద్రపురాన్ని చేరుతారని, ఆశ్వదానం చేస్తే అశ్వనుల లోకాన్ని అందుకుంటారని, శాకదానం చేసిన వ్యక్తి ఇంద్రునితో సమానం అవుతారని కూడా చెబుతారు.
నాలుగో రోజు
పాలు, పెరుగు, తేనె, నెయ్యి. నాలుగోరోజున నేయి దానం చేసిన వ్యక్తి దీర్ఘాయుష్షు పొందుతారని ప్రాశస్తి. తైలదానం చేస్తే నరలోకం దూరమవుతుంది. తేనే దానం చేస్తే వైకుంఠనగరాన్ని పొందుతారు. పాలు దానం చేస్తే సంపదలు పెరుగుతాయని విశ్వాసం.
ఐదవ రోజు
ధాన్యం, గేదె,బండి,ఎద్దు,నాగలి. అయిదవ రోజున శ్రీక్రుష్ణుడిని పూజించి ధాన్య, శకట దానాలు, పాడి పశువుల దానాలు, నాగలి దానం చేయవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఆరవ రోజు
ఔషధం, చందనం, కర్పూరం, కస్తూరి. ఆరవ రోజున కర్పూర దానం చేస్తే లక్ష్మీపురాన్ని పొందుతారని, చందన దానం చేస్తే చంద్రలోకం పొందుతారని, ఔషధ దానం చేస్తే చక్కని ఆరోగ్యం పొందుతారని చెబుతారు.
ఏడవ రోజు
గ్రుహం,పీఠం,పల్లకి. ఏడవ రోజున గ్రుహదానం చేస్తే ఆ వ్యక్తి ఎక్కువ కాలం గ్రుహస్తుడై ఉంటాడని, పీఠదానం చేస్తే పశువుల సింహాసనం దక్కుతుందని కూడా విశ్వాసం.
ఎనిమిదో రోజు
గంధం చెక్క, అల్లం, పువ్వులు, దుంపలు. ఎనిమిదో రోజున పువ్వుల దానం విరివిగా చేయాలని చెబుతున్నారు. అది చేస్తే ఇంద్రుడు ఆనందిస్తారని,మల్లెపూలు దానం చేస్తే పూజ్యులవుతారని నమ్మకం. పల్లకి దానం చేస్తే దేవత్వం పొందుతారని చెబుతారు.
తొమ్మిదో రోజు
పిండప్రదానం,దాసి, సెయ్య. తొమ్మిదవ రోజున తండ్రి సంతోషం కోసం పిండప్రదానం చేసిన వ్యక్తి సంతానవంతుడవుతాడని చెబుతారు.
పదో రోజు
శివకేశవ పూజ, లక్ష్మీ పార్వతి పూజ కీలకం. పదవ రోజున విష్ణువును ద్రుష్టిలో పెట్టుకుని చేసిన ధర్మం ఎంతో ఫలితాన్నిస్తుందని, శివుని అభిషేకం పువ్వులతో సేవించిన వ్యక్తి శివుని చేరి ఆనందిస్తారని చెబుతారు. ఈరోజున చందనం, కర్పూరం మొదలయిన వాటితో లక్ష్మీ పూజ చేస్తే సర్వసుఖాలు పొందుతారని కూడా నమ్మకం.ఈరోజున సాలగ్రామదానం చేస్తే ఈభూమండలాన్నే దానం చేస్తే వచ్చేటంత ఫలితం దక్కుతుంది.
పదకొండో రోజు
గజదానం. పదకొండో రోజున చేసిన స్నానం ఫలితంగా పదకొండు ఇంద్రియాల్లో చేసిన పాపాన్ని తొలగించుకోవచ్చని విశ్వాసం. ఆశ్చర్యకరమైన ఫలితాలు దక్కుతాయని కూడా చెబుతారు.
పన్నెండో రోజు
విధి ప్రకారం స్నానం. పన్నెండో రోజున విధి ప్రకారం స్నానమాచరించిన వారికి నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలితం దక్కుతుందని కూడా చెబుతారు.