Thursday, 3 September 2015

వేమన పద్యాలు



పప్పు లేని కూడు పరుల కసహ్యమే
అప్పు లేని వాడె యధిక బలుడు
ముప్పు లేని వాడు మొదట సుజ్ఞాని రా !
విశ్వదాభి రామ వినుర వేమా !

తాత్పర్యం : పప్పు లేని భోజనం పస లేని భోజనం. అప్పు లేని వాడే గొప్ప ధనవంతుడు. ఈ లోకంలో ఏ వాంఛల మీద దృష్టి లేనటువంటి వాడే గొప్ప జ్ఞాని.




ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల ?
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్త శుద్ది  లేని శివపూజ లేలరా ?
విశ్వదాభి రామ వినుర వేమ !


తాత్పర్యం : ఆత్మ శోధన లేని ఆచరమూ, భాండశుద్ధి అనగా పాత్ర శుభ్రత లేని వంటకం, చిత్తశుద్ధి అనగా మనసు నిర్మలo లేని శివపూజలూ కూడా వ్యర్ధములు.ఇక్కడ వేమన మనం చేసే ప్రతీ క్రియలయందు త్రికరనంగా అనగా మన మనసా వాచా కర్మణా శుద్ధిగా చేయాలి అనీ శుద్ధి లేకుండా చేసే ఏ పనీ కూడా దేనికీ  పనికిరాదనీ చెపుతున్నారు.    



ధన మెచ్చిన మద మెచ్చును
మదమెచ్చిన దుర్గునంబు మానక హెచ్చు
ధన ముడిగిన మద ముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా !


తాత్పర్యం : ఒక దాంతో ఒకటి ముడి పడి ఉన్న వాటిలో ముందుగా ధనాన్నీ మరియూ మదాన్నీ ముందుగా చెప్పుకోవాలి. ధనం  ఎక్కువైతే మదం ఎక్కువవుతుంది. మదం దుర్గుణ హేతువు. ధనం లేకుంటే మదం అనిగిపోతుంది తద్వారా దుర్గుణం కూడా నశిస్తుంది. వేమన గారు ధనాన్ని గురించి దాని వలన వచ్చే ప్రభావాలను గుణాలని గురించి చక్కగా వివరించారు. 


సత్యమంతుల తోడ సరస మాడగరాదు 
పేదవారి తోడ పెనగరాదు
కలిమి కలుగు వారి గలియనే రాదయా
విశ్వదాభి రామ వినుర వేమ !


తాత్పర్యం : నిజం చెప్పే నిష్టగల వారితో హాస్యం మంచిది కాదు. పేద వాళ్ళతో తగువు పడ రాదు. ధనవంతులతో రాసుకొని - పూసుకొని తిరగటం అంత మంచిది కాదు. వేమన గారు సజ్జనులు, పేదవారు, ధనవంతులతో ఏ  విధంగా ప్రవర్తించాలో వివరించారు.


రేగు పుచ్చ కాయ రేయెల్ల తన్నిన
మురుగ దంత కంత పెరుగు గాని
ఒరులు ఛీ యన్ననూ నోగు సిగ్గెరుగునా
విశ్వదాభి రామ వినుర వేమ !


తాత్పర్యం : హీనమైనట్టిదీ - నిరుపయోగమైనట్టిదీ  అయిన రేగు పుచ్చకాయని తన్నే కొద్దీ అది పెరుగును. అట్లే దుర్జునుడిని ఎన్ని తిట్టినా అతనికి సిగ్గుండదు


2 comments: